గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
JGL: జిల్లాలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై టెక్నికల్ కమిటీ సమగ్ర పరిశీలన నిర్వహించి పనులు వేగవంతం చేయాలని ఇంజనీర్ ఇన్ చీఫ్, ఓ.వి రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్‌లు అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఘాట్ల అభివృద్ది, రహదారి మరమ్మత్తులు, విద్యుత్ సరఫరా, తాత్కాలిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు.