చిన్నారులకు నూతన జీవితం అందించిన కలెక్టర్
ELR: అనాథలైన ముగ్గురు పిల్లలకు ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి నూతన జీవితాన్ని అందించారు. కుక్కునూరుకు చెందిన ముగ్గురు పిల్లల తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. తండ్రి వారిని వదిలేసి వెళ్లడంతో చిన్నారులు అనాథలయ్యారు. సోషల్ మీడియా ద్వారా సమాచారం అందుకున్న కలెక్టర్ బాల సంరక్షణ అధికారుల ద్వారా సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు.