జోరుగా గణేశ్‌ విగ్రహాల విక్రయాలు

జోరుగా గణేశ్‌ విగ్రహాల విక్రయాలు

ATP: వినాయక చవితి సమీపిస్తుండటంతో జిల్లాలో విగ్రహాల విక్రయాలు జోరందుకున్నాయి. అనంతపురంలోని ఆకుతోటపల్లి, తాడిపత్రి, ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాప్తాడు తదితర చోట్ల చిన్న వినాయకుల నుంచి 12 అడుగుల వినాయకుల వరకు అందుబాటులో ఉన్నాయి. సైజును బట్టి రూ.1000 నుంచి రూ.లక్ష వరకు కూడా ధరలు పలుకుతున్నాయి.