VIDEO: శ్రీరామ నవమి.. ముస్తాబైన రామాలయాలు
E.G: శ్రీరామనవమి సందర్భంగా రాజమండ్రిలోని జాంపేట కోదండ రామాలయం, ఏవీఏ రోడ్డు, తిలక్ రోడ్డు, సీతంపేట, ఇన్నిసు పేట, ఆల్కాట్ గార్డెన్స్ ఆలయాలు విద్యుత్ దీపాలతో ముస్తాబయ్యాయి. శుక్రవారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం సీతారాముల కళ్యాణం వైభవంగా జరిపేందుకు ఉత్సవ కమిటీలు భారీ ఏర్పాట్లు చేశాయి.