సర్పంచ్‌ని సన్మానించిన నిరంజన్ రెడ్డి
WNP: గోపాల్పేట మండలం చాకలి పల్లి గ్రామంలోని బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి శేషిరెడ్డి స్థానిక ప్రత్యర్థిపై 670 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో మాజీమంత్రి నిరంజన్ రెడ్డి శుక్రవారం చాకలిపల్లి గ్రామానికి వెళ్లి సర్పంచ్ శేషిరెడ్డి గెలుపొందిన వార్డు మెంబర్లను సన్మానించి వారికి అభినందనలు తెలియజేశారు.