ఎల్లికట్ట‌లో ఉచిత మొబైల్ హెల్త్ క్యాంప్

ఎల్లికట్ట‌లో ఉచిత మొబైల్ హెల్త్ క్యాంప్

NGKL: కల్వకుర్తి మండలంలోని ఎల్లికట్ట గ్రామంలో ఉచిత మొబైల్ హెల్త్ క్యాంపు ఆదివారం ఉదయం ప్రారంభమైంది. టాస్క్ సీఓఓ, ఐక్యత ఫౌండేషన్ ఛైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ హెల్త్ క్యాంప్‌నకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వివిధ రకాల పరీక్షలను ఉచితంగా నిర్వహించి మందులు పంపిణీ చేశారు.