ఆటో, టాక్సీ డ్రైవర్లకు అలర్ట్‌!

ఆటో, టాక్సీ డ్రైవర్లకు అలర్ట్‌!

మహారాష్ట్ర సర్కార్ రాష్ట్రంలోని ప్రజా రవాణా వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టింది. మే 1న ‘మహారాష్ట్ర దినోత్సవం’ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటోరిక్షా, టాక్సీ డ్రైవర్లకు మరాఠీ భాషను తప్పనిసరి చేస్తూ రవాణా శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో పర్మిట్ పొందాలన్నా లేదా డ్రైవర్‌గా కొనసాగాలన్నా మరాఠీ భాషలో ప్రాథమిక అవగాహన ఉండటం నిబంధనగా మారింది.