VIDEO: వర్ష బీభత్సం.. నేలకూలిన వృక్షాలు
MHBD: గంగారం మండలం కోమట్లగూడెం, కాటినగరం గ్రామాల మధ్య బుధవారం భారీ వర్షం కురిసింది. వర్ష ప్రభావంతో భారీ వృక్షాలు నేలకూలడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. అకాల వర్షానికి మొక్కజొన్న, వరి పంటలు తడిసి ముద్దయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు.