ఈ నెల 12న సర్వ సభ్య సమావేశం..!
KRNL: పెద్దకడబూరు మండల ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈ నెల 12న మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో నిర్వహించనున్నట్లు MPDO ప్రభావతి దేవి తెలిపారు. మండల స్థాయి అధికారులు తమ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను సిద్దం చేసుకోవాలని సూచించారు. సమావేశానికి ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, సర్పంచులు హాజరుకావాలన్నారు.