ప్రత్యేక అలంకరణలో ప్రసిద్ధ మురిడి ఆంజనేయుడు

ప్రత్యేక అలంకరణలో ప్రసిద్ధ మురిడి ఆంజనేయుడు

ATP: రాయదుర్గం నియోజకవర్గం డి హిరేహాల్ మండలంలోని మురడి గ్రామంలో వెలసిన ప్రసిద్ధ ఆంజనేయుడు ప్రత్యేక అలంకరణలో శనివారం దర్శనమిచ్చాడు. పురోహితుడు పవన్ కుమార్ స్వామి మూల విరాట్‌కు ఉదయాన్నే పంచామృత, కుంకుమ అర్చనలు చేపట్టి స్వామి మూలవిరాట్ను ప్రత్యేకంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.