చేవెళ్లలో దర్శనమిస్తున్న నో స్టాక్ బోర్డులు
RR: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో పెట్రోల్ కొరత ఏర్పడింది. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని పలు పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఎల్పీజీ కోసం వాహనాలు బారులు తీరాయి. పెట్రోల్ కొరత ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.