VIDEO: గోదావరిలో మృతదేహం కలకలం
NZB: నవీపేట్ మండలంలోని యంచ వద్ద గోదావరి నదిలో గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. శనివారం ఉదయం నదీ తీరంలో శవాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.