గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించిన MLA
WGL: రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని స్థానిక సర్పంచ్‌తో కలిసి ఇవాళ MLA యశస్విని రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి పంచాయతీ భవనం ఒక కేంద్రంగా మారి, ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలు త్వరితగతిన అందేలా చేస్తుందని తెలిపారు.