చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు
TG: కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఎల్లారెడ్డి-కామారెడ్డి రహదారి దాటేందుకు యత్నిస్తున్న చిరుతను స్థానికులు చూశారు. గ్రామాల్లోకి కూడా వచ్చే అవకాశం ఉందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.