VIDEO: వర్ధన్నపేట ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
WGL: వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఇవాళ కలెక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్యసేవలు, ఔషధాల లభ్యత, సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న సౌకర్యాలపై సమీక్షించారు.పేషెంట్లతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న కలెక్టర్, లోపాలను వెంటనే సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు.సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.