వెంగలాయిపల్లి టీచర్‌కు పాన్ ఇండియా ఐకాన్ అవార్డు

వెంగలాయిపల్లి టీచర్‌కు పాన్ ఇండియా ఐకాన్ అవార్డు

ప్రకాశం: గుంటూరులో టీచర్స్ హబ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం పాన్ ఇండియా ఐకాన్ బెస్ట్ టీచర్‌గా పెద్ద చెర్లోపల్లి మండలం వెంగలాయిపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు స్వర్ణ రమణయ్య అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును ఇస్రో శాస్త్రవేత్త చందు శ్రీనివాస్ చేతుల మీదుగా అందుకున్నారు. సొంత నిధులు వెచ్చించి పాఠశాల అభివృద్ధికి కృషి చేసినందుకు రమణయ్యకు అవార్డు దక్కింది.