కాలుష్యానికి చెక్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం

కాలుష్యానికి చెక్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం

ఢిల్లీలోకి ప్రవేశించే వాణిజ్య వాహనాలపై పర్యావరణ పరిహార రుసుము(ECC) పెంచుతూ సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి లైట్ కమర్షియల్ వాహనాలకు రూ.2,000, భారీ ట్రక్కులకు రూ.4,000 ఛార్జ్ వసూలు చేయనున్నారు. నగరంలో కాలుష్యం, ట్రాఫిక్‌ను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 2027 నుంచి ఏటా 5% మేర ఫీజు పెరుగుతుంది.