వామ్మో..చలి గజ గజ వణికిస్తోంది..!

వామ్మో..చలి గజ గజ వణికిస్తోంది..!

హైదరాబాద్ అంతటా చలి తీవ్రంగా పెరిగింది. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో కనిష్టంగా 8.8°C, రాజేంద్రనగర్‌లో 10°C, మచ్చ బొల్లారం, కుత్బుల్లాపూర్ వంటి ప్రాంతాల్లో 11–13°C మధ్య నమోదయ్యాయి. పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రత 27–29°C మధ్య ఉంది. ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు, చలిగాలులు ఎక్కువగా వీచడంతో నగరవాసులు గజగజ వణికే పరిస్థితి ఏర్పడుతుందని TGDPS తెలిపింది.