భక్త కనకదాసు జయంతి వేడుకల్లో మంత్రి సవిత
సత్యసాయి: పెనుకొండ మండలంలో కురుబ కుల ఆరాధ్యదైవం భక్త కనకదాసు జయంతిని శనివారం రాష్ట్ర పండుగగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొని కురుబ కులస్థులు, కూటమి నాయకులతో కలిసి భక్త కనకదాసు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి మాట్లాడుతూ.. కనకదాసు బోధనలు సమాజానికి మార్గదర్శకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.