'మత్తు రహిత సమాజ నిర్మాణం కోసం కృషిచేద్దాం'

'మత్తు రహిత సమాజ నిర్మాణం కోసం కృషిచేద్దాం'

KDP: మత్తు రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరము కలిసికట్టుగా కృషి చేద్దామని పులివెందుల అర్బన్ సీఐ చాంద్బాషా అన్నారు. పులివెందులలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగము, స్నేహిత అమృత హస్తం సేవా సమితి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి సీఐ ప్రసంగించారు.