గొట్టా బ్యారేజ్ లోకి భారీగా చేరుతున్న నీరు

గొట్టా బ్యారేజ్ లోకి భారీగా చేరుతున్న నీరు

SKLM: హిరమండలంలోని ఉన్న గొట్టా బ్యారేజ్ వద్ద ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఇన్ఫ్లో బాగా పెరిగిందని నరసన్నపేట వంశధార ఈఈ ఎం మురళీమోహన్ తెలిపారు. ఆదివారం ఆయన ఫోన్లో మాట్లాడుతూ.. మధ్యాహ్నం మూడు గంటలకి బ్యారేజ్ లోకి 7200 క్యూసెక్కుల నీరు చేరిందని పేర్కొన్నారు. ఎడమ కాలువకు 1771, కుడి కాలువకు 417 క్యూసెక్కుల నీరు విడిచి పెడుతున్నామన్నారు.