పాపన్న గౌడ్ గొప్పయోధుడు: ఎమ్మెల్యే

పాపన్న గౌడ్ గొప్పయోధుడు: ఎమ్మెల్యే

MBNR: నాటి దొరల అరాచకాలు, మొగలాయిల దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కొని సామాన్య ప్రజలకు అండగా నిలబడ్డ గొప్ప యోధుడు సర్దార్ పాపన్నగౌడ్ అని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. ఆయన వర్ధంతి సందర్భంగా పట్టణంలోని గ్రీన్ బెల్ట్‌లోని విగ్రహానికి పూలమాలతో ఎమ్మెల్యే నివాళులర్పించి మాట్లాడారు. తెలంగాణ చరిత్రలో ఆయన పాత్ర అత్యంత విశేషమైందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.