'డ్రగ్స్ నియంత్రణకు సమష్టిగా కృషిచేయాలి'

NZB: జిల్లాలో గంజాయి, ఆల్ఫ్రాజోలం వంటి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నియంత్రణకు ఆయా శాఖల అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, CP సాయి చైతన్య అన్నారు. ఇవాళ కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమన్వయ సమావేశంలో మాట్లాడారు. యువత, విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.