రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
BPT: ఇంకొల్లు మండలం దుద్దుకూరు వాగు వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్సై సురేష్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.