'17న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం'
మంచిర్యాల శ్రీశ్రీ నగర్‌లోని ఆనంద నిలయంలో ఈ నెల 17న మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.