VIDEO: పెద్దకడబూరులో పైరయ్య ఆంజనేయుని రథోత్సవం
KRNL: పెద్దకడబూరు మండలం బసలదొడ్డి శివార్లలో ఉన్న వ్యాసరాజ ప్రతిష్ఠిత శ్రీ పైరయ్య ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం రథోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ప్రధాన అర్చకుడు రామకృష్ణ స్వామి జలాభిషేకం, పుష్పాలంకరణ, పంచామృతాభిషేకంతో పూజలు నిర్వహించారు. రథోత్సవాన్ని దర్శించేందుకు భక్తులు భారీ సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.