VIDEO: వాటర్ పైపులైన్‌కు కన్నం.. వేగంగా మరమ్మతులు
శ్రీకాకుళం: ఆదివారంపేట మెయిన్ వాటర్ లైన్ నుంచి దమ్మలవీధి సర్వీస్ రిజర్వాయర్‌కు వెళ్లే వాటర్ పైపులైన్‌కు కన్నం పడింది. దీంతో నీటి సరఫరా తాత్కాలికంగా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు విశాఖ నుంచి టెక్నిషియన్లను రప్పించారు. 24 గంటల్లోనే రెండు మేజర్ లైన్లు మార్చి నీటి సరఫరాను పునరుద్ధరించినట్లు స్థానికులు తెలిపారు.