VIDEO: ఆటో బోల్తా మహిళకు గాయాలు

VIDEO: ఆటో బోల్తా మహిళకు గాయాలు

నెల్లూరు: జిల్లా కలువాయి మండలం తోపుగుంట వద్ద గురువారం ఓ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి ఆటో బోల్తా పడిన ఘటనలో ఆటోలో ఉన్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మహిళ వెంకటరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పుల్లమ్మగా గుర్తించారు. ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.