'బాధిత కుటుంబాలను ఆదుకోవాలి'
SKLM: జలుమూరు మండలం రామకృష్ణాపురంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం గ్రామాన్ని ఆయన సందర్శించి కాలిన ఇళ్లను పరిశీలించారు. అగ్ని ప్రమాదంలో కాలిపోయిన ఇళ్లకు నష్టపరిహారం అందించాలన్నారు. శాశ్వత గృహాలు మంజూరు చేయాలని కోరారు.