దుకాణాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి

దుకాణాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి

VZM: జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ ఆదేశాల ప్రకారం కొత్తవలసలో ఉన్న పలు విత్తనాల దుకాణాలు, గోడౌన్‌లను మండల ప్రత్యేక అధికారిణి ఎం.అన్నపూర్ణ, MAO రాంప్రసాద్‌తో కలిసి బుధవారం తనిఖీలు చేపట్టారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్షించిన, అధిక ధరకు విక్రయించిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఎరువుల నిల్వలను, ధరల వివరాలను నోటీసు బోర్డులో పొందుపరచాలని ఆదేశించారు.