ఇంటర్ కాలేజ్ వాలీబాల్ పోటీలను ప్రారంభించిన వీసీ

NZB: తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ వాలీబాల్ మెన్, ఉమెన్ చాంపియన్షిప్ పోటీలను గురువారం యూనివర్శిటీ ప్లే గ్రౌండ్‌లో వైస్ ఛాన్స్‌లర్ టీ.యాదగిరిరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేయాలనే సంకల్పంతో ఉందని తెలిపారు. క్రీడాకారుల ప్రతిభను గుర్తించి రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం అన్నారు.