మే 12 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు

SKLM: ఇంటర్మీడియట్ పరీక్షలకు పగడ్బంది ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో శుక్రవారం జూం కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మే 12 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయని, జిల్లాలో 56 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు ఉంటాయన్నారు.