'హోంకంపోస్ట్‌పై అవగాహన కల్పించాలి'

'హోంకంపోస్ట్‌పై అవగాహన కల్పించాలి'

GNTR: గుంటూరు నగర ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి ఇవ్వాలని కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. సోమవారం ఆయన నెహ్రూనగర్, ఆకులవారి తోట, అంకమ్మ నగర్ వంటి ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులు, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.ప్రజలకు వ్యర్థాల విభజన, హోం కంపోస్ట్ తయారీపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.