అర్ధాంతరంగా భారత్‌కు వచ్చేస్తున్న కుల్దీప్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న T20 సిరీస్ చివరి 2 మ్యాచులకు కుల్దీప్ యాదవ్ దూరమయ్యాడు. అతణ్ని అర్ధాంతరంగా T20 స్క్వాడ్ నుంచి రిలీజ్ చేసిన BCCI.. భారత్‌కు రావాలని పిలుపునిచ్చింది. ఈ నెల 6 నుంచి సౌతాఫ్రికా-Aతో జరిగే అనధికార 2వ టెస్టులో కుల్దీప్ ఆడాలని బోర్డ్ భావిస్తోంది. సౌతాఫ్రికా టెస్టు సిరీస్ నేపథ్యంలో BCCI ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.