నా గురించి కిషన్‌రెడ్డికి పూర్తి అవగాహన లేదు: మంత్రి
HYD: ఇవాళ నూతన మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కాగా, ప్రమాణస్వీకారం అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'బీజేపీ, BRS నాపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, నా గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పూర్తిస్థాయి అవగాహన లేదని, నాపై ఉన్న ఒక్క కేసులోనూ నేరం రుజువు కాలేదన్నారు. తనకు మంత్రిగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానానికి, సీఎంకు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.