మద్యం సేవించి వాహనాలను నడపొద్దు: ఎస్సై

మద్యం సేవించి వాహనాలను నడపొద్దు: ఎస్సై

VZM: బొండపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై యూ. మహేష్ సోమవారం ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని వాహనదారులకు సూచించారు. డ్రైవింగ్ సమయంలో వాహనపత్రాలు వెంట ఉండాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని కోరారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.