'ఉపాధి కూలీలు సమయపాలన పాటించాలి'
VZM: రాజాం MPDO శ్రీనివాసరావు సోమవారం స్దానిక VR అగ్రహారంలో ఉపాధి హామీ నిధులతో రాజా చెరువులో చేస్తున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలు సమయపాలన పాటించాలని సూచించారు. మస్తర్లు తప్పకుండా వెయ్యాలన్నారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో నీరుని ఎక్కువగా తీసుకోవాలని, అలసటగా ఉన్నప్పుడు నీడలో సేద తీరాలని పేర్కొన్నారు.