'రాత్రి వేళ వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తాం'
ASR: చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాత్రి వేళ వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని సీఐ గోపాలకృష్ణ హెచ్చరించారు. రాత్రి ప్రయాణం ప్రమాదకరమని, తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నందున వాహనాలను నిలిపివేస్తున్నామన్నారు. బుధవారం రాత్రి ఘాట్ రోడ్డుకు వెళ్తున్న ఓ లోడు వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ తనిఖీల్లో ఎస్సై రమేష్ పాల్గొన్నారు.