9న అన్నదాత పోరు కార్యక్రమం

9న అన్నదాత పోరు కార్యక్రమం

W.G: ఈ నెల 9న జిల్లాలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించే 'అన్నదాత పోరు'కు రైతులు, కార్యకర్తలు తరలిరావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు శనివారం కోరారు. కాళ్ల మండలం పెదఅమిరంలో పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన ఈ మేరకు కోరారు. ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, ఉండి ఇంఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు పాల్గొన్నారు.