VIDEO: జిల్లా కేంద్రంలో శునకాల పట్టివేత

WNP: జిల్లా కేంద్రంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు వీధి శునకాలను బంధించి తరలిస్తున్నారు. శనివారం న్యూటౌన్ కాలనీలో పుర సిబ్బంది, ప్రత్యేక సిబ్బంది కలిసి వీధి కుక్కలను పట్టుకుని ప్రత్యేక వాహనంలో తరలించారు. పెంపుడు కుక్కలను యజమానులు రోడ్లపైకి వదలవద్దని అధికారులు సూచించారు. అలా వదిలితే వాటిని బంధించి తీసుకెళ్తామని హెచ్చరించారు.