'రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలం'

NLG: తెలంగాణ రాష్ట్రంలోనే రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం వేములపల్లి మండల కార్యదర్శి పాదూరి శశిధర్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మద్యం తయారు చేసి అందించడంలో ఉన్న శ్రద్ధ రైతులకు అవసరమయ్యే ఎరువులు అందించడంలో ప్రభుత్వం లేదని అన్నారు.