కమలాపురంలో 200 మందికి పైగా ఉచిత నేత్ర వైద్య పరీక్షలు

కమలాపురంలో 200 మందికి పైగా ఉచిత నేత్ర వైద్య పరీక్షలు

KDP: మదర్ థెరిసా సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్, అభిలాష్ నేత్ర వైద్యశాల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం కమలాపురంలోని వెంకటేశ్వర హైస్కూల్‌లో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతమైనట్లు వైద్యులు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ బి. ప్రహ్లాద ముఖ్య అతిథిగా హాజరైన ఈ శిబిరంలో 200 మందికి పైగా ప్రజలు కంటి పరీక్షలు చేయించుకున్నారు. ట్రస్ట్ తరఫున అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.