పహల్గామ్ ఉగ్రవాదులకు కఠిన శిక్షణ?

జమ్మూకశ్మీర్ జైళ్లలోని టెర్రరిస్టుల ఇంటరాగేషన్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పహల్గామ్ దాడిలో పాల్గొన్న వారికి పర్వత ప్రాంతాల్లోని స్థావరాల నిర్మాణంలో పాక్ ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తేలింది. అంతేకాదు.. రోజుల తరబడి అడవుల్లో నక్కి జీవించడం కూడా నేర్పించారు. ఇటీవల అడవుల్లో బయటపడ్డ ఉగ్రస్థావరాలు, ఇతర దర్యాప్తుల విచారణల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.