INSPIRATION: సర్దార్ వల్లభాయ్ పటేల్

INSPIRATION: సర్దార్ వల్లభాయ్ పటేల్

స్వతంత్ర భారతదేశ ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐక్యతకు చిహ్నం. సుమారు 556 స్వదేశీ సంస్థానాలను రాజీ, దండోపాయాలతో భారత యూనియన్‌లో విలీనం చేసి, అఖండ భారతాన్ని నిర్మించడంలో ఆయన కృషి అద్భుతం, చిరస్మరణీయం. ఆయన దృఢ సంకల్పం, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు నేటి తరానికి గొప్ప స్ఫూర్తిదాయకం. ఆయన జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటాం.