కత్తితో బెదిరించి.. బంగారం దొంగలింపు

కత్తితో బెదిరించి.. బంగారం దొంగలింపు

కృష్ణా: ఉంగుటూరు(M) వెన్నుతలలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటు చేసుకుంది. మాస్కు ధరించి వచ్చిన గుర్తు తెలియని దుండగుడు, బొమ్మి సింహాచలం (70) అనే వృద్ధురాలిపై కత్తితో బెదిరించి బంగారు గొలుసు అపహరించాడు. ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఉంగుటూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.