ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి: MLA BLR

NLG: రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. మిర్యాలగూడ లోని కాంగ్రెస్ కార్యాలయంలో రాజీవ్ జయంతి కార్యక్రమానికి ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌తో కలిసి బుధవారం హాజరయ్యారు. చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడారు.