జాతీయస్థాయి నెట్ బాల్ పోటీలకు గురుకుల క్రీడాకారుడు

NRPT: ఈనెల 28 నుండి 31 వరకు తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని ఆర్ఎంకే ఇండోర్ స్టేడియంలో జరిగే 30వ జాతీయస్థాయి సబ్ జూనియర్ నెట్ బాల్ బాలబాలికల పోటీలకు ధన్వాడ మండలం కొండాపూర్ గిరిజన గురుకుల విద్యార్థి శ్రీనివాస్ ఎంపికైనట్లు ప్రిన్సిపల్ రాజారాం శుక్రవారం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బాలుర జట్టు తరపున శ్రీనివాస్ పాల్గొంటారని చెప్పారు.