ఉదయాన్నే ఇలాంటివి తీసుకోండి!
ఉదయం పూట రోజంతా ఉత్సాహాన్ని ఇచ్చే ఆహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. 'రాగులు, సజ్జలు, జొన్నలతో చేసిన బ్రెడ్, అటుకులు, ఓట్ మీల్ వంటివి తీసుకోవాలి. గుడ్లు, పెరుగు వంటితోపాటు పీచు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. పండ్లు, ఆమ్లెట్, బాదం, అక్రోట్, సోయాపాలు, కాయగూరలు తినాలి. నూనెలో ముంచి తీసే పూరీ, వడ, బోండాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలి' అని వైద్యులు చెబుతున్నారు.