బండి సంజయ్‌ను కలిసిన గిరిజన మోర్చా నాయకుడు రవి

SRPT: జిల్లా గిరిజన మోర్చా నాయకుడు ధరావత్ రవినాయక్ సోమవారం రాత్రి కరీంనగర్‌లో కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్‌ను మర్యాదకపూర్వకంగా కలిశారు. జిల్లాలో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రవి నాయక్ కేంద్రమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని రాజకీయాల గురించి చర్చించారు.