రేపటి నుంచి రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్

SDPT: జగదేవపూర్ మండలంలో రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 5న ప్రారంభమై జూన్ 6వ తేదీ వరకు జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి వసంతరావు తెలిపారు. ప్రతి రైతువేదికలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి తమ పరిధిలోని గ్రామాల రైతులకు రిజిస్ట్రేషన్ చేస్తారని తెలిపారు. కావున మండలంలో ఉన్న రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.